Surprise Me!

హాస్య నటుడు విజయ్ చివరి కోరిక వెలుగులోకి

2017-12-15 35 Dailymotion

Telugu comedian Vijay sai's wife vanitha Reddy went into under ground. PHONE conversation of wife and husband out <br /> <br />హాస్య నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య వనిత రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కుటుంబ తగాదాలపై పలు ఆరోపణలు వినిపిస్తుండడంతో పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో స్పష్టంగా లేదు. దీంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వనితా రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి. <br />విజయ్ ఇంటికి నలుగురితో వచ్చి వనితా రెడ్డి కారు తీసుకువెళ్లినట్లు ఒక కేసు నమోదు కాగా, విజయ్ ఆత్మహత్యకు కారణమని మరో కేసు వనితా రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వనితా రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతోనే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. <br />విజయ్ ఆత్మహత్య చేసుకోక ముందు తన భార్య వనితతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో సంభాషణ వెలుగు చూసింది. అందులో విజయ్ తన భార్య వనితను చివరి కోరికను కోరినట్టు స్పష్టంగా ఉంది. వనితతో ఈ ఫోన్ సంభాషణ సమయంలోనే విజయ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు దాన్ని బట్టి తెలుస్తోంది.

Buy Now on CodeCanyon