Surprise Me!

సూపర్ స్టార్ న్యూ లుక్ చూస్తే షాకే !

2017-12-15 1,789 Dailymotion

A new teaser of Mohanlal’s much-awaited Odiyan is out and we are amazed. When the project was first announced, a sketch of Mohanlal’s proposed look was released

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ త్వరలో 'ఒడియన్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఇందులో మోహన్ లాల్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ సినిమా కోసం మోహన్ లాల్ దాదాపు 20 కేజీల బరువు తగ్గారు. లుక్ పరంగా చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. 57 సంవత్సరాల వయసున్న మోహన్ లాల్ ఈ లుక్ రావడానికి చాలా కష్టపడ్డారని, నిపుణుల పర్యవేక్షణలో పిట్ నెస్ ట్రైనింగ్, స్పెషల్ డైట్ తీసుకున్నారని తెలుస్తోంది.
‘ఒడియన్' చిత్రానికి విఎ శ్రీకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ ఒడియన్ మానిక్కన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
మోహల్ లాల్ కెరీర్లో ఇదో ప్రతిష్టాత్మ మూవీ. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మోహన్ లాల్ ఇంతకు ముందు నటించిన మన్యంపులి భారీ విజయం సాధించింది. ఒడియన్ చిత్రం అంతకు మించేలా ఉంటుందని అంటున్నారు. మణ్యంపులి చిత్రానికి స్టంట్స్ కంపోజ్ చేసిన పీటర్ హెయిన్ ఈ చిత్రానికి కూడా పని చేయనున్నారు.
ఒడియన్ సినిమా తర్వాత విఎ శ్రీకుమార్ దర్శకత్వంలోనే మోహన్ లాల్‌ ప్రధాన పాత్రలో రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ‘మహాభారతం' సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ భీముడి పాత్రలో కనిపించనున్నాడు.

Buy Now on CodeCanyon