Surprise Me!

ఆడియో రిలీజ్ కు వారిని పిలువొద్దు..!

2017-12-16 1 Dailymotion

Agnyathavasi audio launch program slated on December 19th. In this occassion, Pawan gave clear instructions to the film unit about not inviting outsiders for the audio launch.

ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పరుగులు పెడుతున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా అజ్ఞాతవాసి చిత్రంతో ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 19న హైదరాబాద్‌లో జరుగనున్నది. ఈ కార్యక్రమానికి భారీగా ప్రేక్షకులు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ హెచ్చరించినట్టు సమాచారం.
గతంలో జరిగిన ఆడియో ఆవిష్కరణ సందర్భంగా చోటుచేసుకొన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అతికొద్ది మందిని మాత్రమే పిలువాలి అని పవన్ స్పష్టం చేసినట్టు తెలిసింది.
ముఖ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతోపాటు అభిమానులను మాత్రమే పిలువాలి అని పవన్ కల్యాణ్ సూచించారట. ఆడియో ఆవిష్కరణ జరిగే సభావేదికలో పట్టే విధంగా ఆహ్వానాలను పంపాలని, ఇన్విటేషన్ కార్డులను ముద్రించాలిని సూచించారట.
సినిమాకు సంబంధం లేని వారిని, బయట వ్యక్తులను అజ్ఞాతవాసి ఆడియోకు పిలువకూడదు. చిత్ర యూనిట్‌ సభ్యులు, ఫ్యాన్స్ మధ్యనే నిరాడంబరంగా జరుగాలి అని పవన్ తేల్చి చెప్పారట.
ఇక అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ఫంక్షన్‌కు చిరంజీవి రావడం లేదనేది చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక చిరంజీవి స్థానంలో ముఖ్య అతిథిగా వెంకటేష్ వస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైటెక్స్‌లో డిసెంబర్ 16న జరుగునున్నది.

Buy Now on CodeCanyon