Surprise Me!

Daily Horoscope Telugu దిన ఫలాలు 18 -12-2017

2017-12-16 433 Dailymotion

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. డిసెంబర్ 18 వ తేదీ సోమవారం 2017 దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. అమావాస్య ఉదయం 10 గంటల 53 నిమిషముల వరకు వుంది. జ్యేష్ట నక్షత్రం ఉదయం 6 గంటల 50 నిమిషముల వరకు వుంది. అమృత సమయం రాత్రి 2 గంటల 20 నిమిషముల నుంచి 4 గంటల 16 నిమిషముల వరకు ఉంది. రాహు కాలం ,వర్జ్యం , యమ గండం నకు సంబందించిన సమయాలు. మేష రాశి వారికి దూర సంభాషణలు చేస్తారు. భార్య సహకారం తో కటినమైన పనులు పూర్తి చేస్తారు. తల్లి తండ్రుల ప్రేమను గెలుస్తారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగ చేస్తాయి. వృషభ రాశి వారు తలచిన కోరికలు నెరవేరతాయి. కొత్త అవకాశాలు చేజారకుండా చూస్తారు. భార్య అనుకూలంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. మిధున రాశి వారికి చేయు పనులు పూర్తి చేస్తారు. ధన ఇబ్బందులుంటాయి. పిల్లలు భాద్యతతో వ్యవహరిస్తాడు. కర్కాటక రాశి వారికి చేయు పనులు యందు ఆటంకాలు వుంటాయి. కొత్త అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి.ఇంటి పనులు ఆనందంగా జరగ గలవు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. సింహ రాశి వారికి పిల్లల అవసరాలు అన్నిటిని చూస్తారు. దగ్గరి బంధువుల రాకపోకలుంటాయి. కన్య రాశి వారికి గృహ అవసరాలు తీరుస్తారు. పని వారి సహకారం వుంటుంది.ధన ప్రణాళికలు వేస్తారు. తుల రాశి వారికి ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. తలచిన పనులు పట్టుదలతో పూర్తవుతాయి.దగ్గరి బంధువుల రాకపోకలుంటాయి. సోదర కలయికలుంటాయి. వృశ్చిక రాశి వారు ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు ధనం వచ్చేలా చేస్తాయి. ధనూ రాశి వారు ఆనందంగా వుంటారు. బంధు మిత్రుల సహకారం కూడా వుంటుంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. మకర రాశి వారికి చేయు పనుల యందు ఆటంకాలు వుంటాయి. ఆధ్యాత్మిక చింతన వుంటుంది. కుంబ రాశి వారికి బంధు మిత్రుల కలయికలుంటాయి. ఇంటి అవసరాలు తీరుస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు అనుకున్న లాభాన్నిస్తాయి. దైవారాధన చేయాలి.

Buy Now on CodeCanyon