Surprise Me!

India Vs Sri Lanka 2nd T20 Preview

2017-12-22 47 Dailymotion

India are look for another win in the 2nd T20 International against Sri Lanka to be played at the Holkar Stadium at Indore on Friday. <br />అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్ మరో సిరిస్‌ను గెలుచుకునేందుకు సన్నద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే గెలుచుకోవాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇండోర్ వేదికగా శుక్రవారం భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది.కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా పూర్తి ఆధిపత్యం సాధించి భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. అదే జోరుని రెండో టీ20లో కూడా చూపిస్తే 2-0తో టీ20 సిరిస్‌ను కూడా కైవసం చేసుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు పెద్దగా మార్పులేమీ చేసేలా కనిపించడం లేదు. <br /> <br />కెప్టెన్‌ రోహిత్‌ శర్నకు ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో రెండో టీ20లో కూడా కేఎల్ రాహులే ఓపెనర్‌గా రానున్నాడు. ఇక వన్ డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్ ఉండనే ఉన్నాడు. తొలి టీ20లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తన దైన శైలిలో రాణించాడు. తొలి టీ20లో చివర్లో మనీష్ పాండే దూకుడుతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఇలా టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశమే. దీంతో ఇండోర్‌లో కూడా ఇదే ఆర్డర్‌ను కొనసాగించొచ్చు. ఓవర్లు మరీ తక్కువగా ఉండి... భారీ హిట్టింగ్‌ చేయాల్సి వస్తే పాండ్యాను ముందుగా పంపే ఆలోచన చేయొచ్చు. <br />

Buy Now on CodeCanyon