YCP announced Monday that they withdrew from the by-election of Kurnool MLC. But there is a huge debate going on this matter. So again there is any twist will happen in this issue ? . Tuesday with the completion of the nominations, then matter will clear. <br /> <br />కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి వైసిపి తప్పుకోవడంపై పెనుదుమారం రేగుతోంది. జగన్ మరోసారి తప్పులో కాలేసాడని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే అభిప్రాయం వైసిపి లోని సీనియర్ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా అంటున్నారట. మరోవైపు టిడిపితో సహా మిగతా రాజకీయ పార్టీలన్నీ జగన్ నిర్ణయాన్నిఎద్దేవా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసిపి మరో ట్విస్ట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. కర్నూలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కెఈ ని టిడిపి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కర్నూలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలనుంచి వైదొలగినట్లు వైసీపీ ప్రకటన ఆ పార్టీ నేతలకే కాదు రాజకీయ పార్టీలన్నిటిని షాక్ కు గురిచేసింది. <br />పోనీ తామే ఆరోపించినట్లు టిడిపి అవినీతి సొమ్ముతో ఈ ఎన్నికలను గెలిచేందుకు సిద్దమైందని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? టిడిపి డబ్బు రాజకీయం ముందు మేము నిలబడలేకపోతున్నామని ఒప్పుకున్నట్లే కదా అనే ప్రశ్న అన్నివైపుల నుంచి ఉత్పన్నమవుతోంది. అంతేకాకుండా రాజకీయ పరంగా చూసినపుడు తాము ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం తమ పార్టీ మీద పడుతుందని, తద్వారా పార్టీ మరింత బలహీనపడుతుందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నాఅది కూడా సరికాదంటున్నారు.