There is an interesting discussion going on about Prabhas next project after Saaho movie. Prabhas said to have given his nod to Tamil director Atlee Kumar as per the update.

సాధారణంగా ఒక రీజినల్ హీరోను మిగతా రాష్ట్రాల్లో అంతగా పట్టించుకోరు. కొంతమంది హీరోల ముఖం కూడా అక్కడ గుర్తుపట్టరంటే అతిశయోక్తి కాదు. కానీ బాహుబలి పుణ్యమాని ప్రభాస్ రీజినల్ స్టార్ నుంచి అందరూ గుర్తుపట్టే ఫిగర్‌గా మారిపోయారు.
ఇప్పుడు పక్క ఇండస్ట్రీ దర్శకులు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఒకరు ప్రభాస్‌తో సినిమా పట్టాలెక్కించడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఇంతకీ ఎవరా డైరెక్టర్?...
మెడికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ ఏడాది విడుదలైన మెర్సల్ చిత్ర దర్శకుడు అట్లీ..సామాజికంగాను.. రాజకీయంగాను ఈ సినిమా పెద్ద చర్చనే లేవనెత్తింది. అంతకుమించి వివాదంగానూ మారింది. చివరికి బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బంపర్ హిట్ సొంతం చేసుకుంది. ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అట్లీ.. ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట.
మెర్సల్ చిత్ర సమయంలోనే దర్శకుడు అట్లీ ప్రభాస్ ను సంప్రదించి.. కథకు సంబంధించిన ఒక లైన్ చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లో ప్రభాస్ బాహుబలి-2 సినిమాతో, అట్లీ మెర్సల్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల.. దీనిపై చర్చలు కొలిక్కి రాలేదట.