It is said that out of 45 MLAs in Andhra Pradesh 5 MLAs in West Godavari district are facing trouble. Chandrababu naidu looking their performance.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 45 మంది శానససభ్యులపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు బాగు పడకపోతే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయం సందేహమేనని అంటున్నారు. తమ తెలుగుదేశం పార్టీలో 45 మంది శాసనసభ్యుల పనితీరు సంతృప్తికరంగా లేదని, వారు మరింత బలపడాలని, లేదంటే ప్రత్యామ్నాయం తప్పదని చంద్రబాబు ఇటీవల పార్టీ ఆంతరంగిక సమావేశంలో అన్నారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకంపనలు రేపుతున్నాయి. జిల్లాలో కనీసం ఐదుగురి పనితీరు బాగాలేదనే చర్చ సాగుతోంది. దాంతో వారెవరనే చర్చ సాగుతోంది. కడప కడపకూ తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును చంద్రబాబు అభినందించారు. పార్టీ సమావేశాల్లో ఎమ్మెల్యే ఆయనకు కేక్ కూడా తినిపించారు.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చొరవ చూపించారు. వారి పనితీరుకు చంద్రబాబు సంతృప్తి చెందుతున్నారు. కానీ ఐదుగురు శాసనసభ్యులు మాత్రం వెనకబడిపోయినట్లు చంద్రబాబు గుర్తించారని అంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో కన్నా మెట్ట ప్రాంతంలోనే ఎమ్మెల్యేలకు మైనస్ మార్కులు పడినట్లు చెబుతున్నారు. వచ్చే జన్మభూమి కార్యక్రమం తర్వాత మరోసారి ఎమ్మెల్యేల పనితీరుపై అంచనా వేసే అవకాశాలున్నాయి. దాంతో అప్పటి లోగా చంద్రబాబును సంతృప్తిపరిచే విధంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో వారున్నారు.