South Indian Superstar Rajinikanth has removed the White Lotus image from his 'Baba Symbol' in http://www.rajinimandram.org website.

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రాజకీయ రంగప్రవేశం జరిగిపోయింది. చెన్నైలోని శ్రీరాఘవేంద్ర కల్యాణమండపంలో డిసెంబర్ 31వ తేదీ వరకు అభిమానులతో వరుసగా సమావేశం అయిన రజనీకాంత్ అదే రోజు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బాబా గుర్తు విషయంలో రజనీకాంత్ వెనకడుగు వేశారు.

రజనీకాంత్ జరిపిన సమావేశంలో వెనుక బాబా ముద్ర గుర్తు ఉన్న ఫోటో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ విడుదల చేసిన వెబ్ సైట్ (రజనీమండ్రం వెబ్ సైట్ ) లో బాబా ముద్రలో ఉన్న తెల్లటి తామరపువ్వును ఆకస్మికంగా తొలగించారు.రజనీకాంత్ ఆధ్యాత్మికత జీవితం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. హిమాలయాల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్నారని విశ్వసించే ఆధ్యాత్మిక గురువు బాబాజీని రజనీకాంత్ పూజిస్తారు. బాబాజీ చూపే ముద్రతోనే రజనీకాంత్ తన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు.

హిమాలయాల్లో ఇప్పటికే సజీవంగా ఉన్నారని విశ్వసించే బాబాజీ కుడిచేతి చూపుడు వేలు, చిటికెన వేలు పైకెత్తి మిగిలిన మూడు వేళ్లను ముడిచి వుంచే ముద్రను ఆబాణ ముద్ర అని పిలుస్తారు. రజనీకాంత్ అభిమానులతో ఏర్పాటు చేసిన అన్ని సమావేశాల్లో వెనుక కచ్చితంగా ఆముద్ర ఉంటుంది. అందులో బాబా ముద్ర కింద తెల్లటి తామరపువ్వు ఉంటుంది.
బీజేపీ గుర్తు తామరపువ్వు. రజనీకాంత్ ఉపయోగిస్తున్న బాబా ముద్ర కింద తెల్లటి తామరపువ్వు ఉంది. రజనీకాంత్ కచ్చితంగా బీజేపీతో జతకడుతారని దేశ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం భవిష్యత్తులో తనకు చేటు తెస్తోందని రజనీకాంత్ ఆందోళన చెందుతున్నారని తెలిసింది.