It is said that Anchor Pradeep is trying to escape from Drunk and Drive case.

డిసెంబర్ 31న అర్ధరాత్రి తర్వాత మోతాదుకు మించి మద్యం తాగి పోలీసులకు చిక్కిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ తెరవెనుక రాయబారం నడుపుతున్నారా? కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.
కేసు నుంచి తప్పించుకునేందుకు అతను జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందుకే అజ్ఞాతంలో ఉన్నాడని అంటున్నారు. కేసు నుంచి తప్పిస్తానని ఆయనకు ఓ ప్రముఖ వ్యక్తి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.
ఏం జరగకుండా చూసుకుంటానని సదరు ప్రముఖ వ్యక్తి.. ప్రదీప్‌కు హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరు కాకుండా ఉండేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే సీజ్ చేసిన కారును తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.