A 29-year-old junior engineer of Bokaro Steel Plant was forced to marry a woman at point in Bihar’s state capital.The incident came to light after a video clipping of the forced marriage went viral on social media. <br /> <br />సాధారణంగా పెళ్లంటే వధూవరుల ఇష్టపూర్వకంగా, ఇరు కుటుంబాల సమ్మతితో ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుగుతుంది. కానీ, ఇక్కడ మాత్రం ఓ యువకుడిని హుటాహుటిన రప్పించి, ఆ తర్వాత కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ యువకుడికి తమ ఇంటికి తీసుకెళ్లి తుపాకీ గురిపెట్టి వధువుకు తాళి కట్టించడం సంచలనంగా మారింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. <br />వివరాల్లోకి వెళితే.. వినోద్ కుమార్ అనే యువకుడు బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడు డిసెంబర్ 3న పాట్నాలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు హతియా-పట్నా ఎక్స్‌ప్రెస్‌లో బొకారో నుంచి బయలు దేరాడు. <br />అయితే, సురేంద్ర యాదవ్(ప్రస్తుతం అతడు బలవంతంగా పెళ్లి చేసుకున్న యువతి సోదరుడు) అనే వ్యక్తి అతడికి ఫోన్ చేసి మోకామాకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లగానే అతడిని కిడ్నాప్ చేసి పండారక్ గ్రామానికి తీసుకెళ్లి తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తామంటూ హెచ్చరించారు.