Surprise Me!

‘అజ్ఞాతవాసి’ చూసిన ఫ్రెంచి డైరెక్టర్.. ట్విట్టర్లో షాకింగ్ కామెంట్స్ !

2018-01-10 12,831 Dailymotion

"Screening at #LeBrady tonight. Great atmosphere thanks to the audience. I could‘ve loved the movie but unfortunately the plot was too familiar. #LargoWinch #Agnyaathavaasi" Jérôme Salle tweeted.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రంపై కాపీ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫ్రెంచ్ మూవీ 'లార్గోవించ్' చిత్రానికి కాపీ అనే ప్రచారం జరిగింది. 'లార్గో వించ్' చిత్రం బాలీవుడ్ రీమేక్ హక్కులు దక్కించుకున్న 'టి సిరీస్' సంస్థ ఈ వార్తలు విని కంగారు పడటం, 'అజ్ఞాతవాసి' చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపడం జరిగిందనే వార్తలు జాతీయ మీడియాలో సైతం వినిపించాయి.
ఇండియన్ మీడియాలో ఈ వార్తలు విన్న ‘లార్గో వించ్' చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లే...... పారిస్‌లోని లీ బ్రాడీ మల్లీ ప్లెక్స్ థియేటర్లో ‘అజ్ఞాతవాసి' సినిమాకు టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని మరీ సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం ఆయన ట్విట్టర్ ద్వారా సంచలన కామెంట్స్ చేశారు.
‘అజ్ఞాతవాసి' సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన జెరోమ్ సల్లే అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి చూసి షాకయ్యారు. అక్కడి వరకు వెళ్లిన తర్వాత కానీ ఆయనకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో?... గ్రేట్ అట్మాస్పియర్ అంటూ ట్వీట్ చేశారు.
‘అజ్ఞాతవాసి' సినిమా చూసిన అనంతరం జెరోమ్ సల్లే స్పందిస్తూ.... సినిమా బావుందని, తెరకెక్కించిన విధానం నచ్చిందని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
సినిమా అంతా బాగానే ఉంది కానీ, దురదృష్ట వశాత్తు ఈ చిత్రం నేను తెరకెక్కించిన ‘లార్గోవించ్' చిత్రానికి చాలా దగ్గరి పోలికలతో ఉందని వెల్లడించారు. ఇలా వెల్లడించడం ద్వారా తన సినిమా మూలాన్ని కాపీ కొట్టారని చెప్పకనే చెప్పారు జెరోమ్ సల్లే.

Buy Now on CodeCanyon