Surprise Me!

పవన్ 'జంధ్యం' ధరించారా ? అంతా త్రివిక్రమ్ వాళ్ళేనా ?

2018-01-11 500 Dailymotion

Powerstar Pawan Kalyan was spotted wearing Jandhyam (the sacred thread which will be wore by Brahmins, Vyshyas and Kshatriyas). <br /> <br />త్రివిక్రమ్ సహవాసం పవన్ కల్యాణ్‌ను బాగానే ప్రభావితం చేసిందని చెప్పాలి. ఆలోచనల పరంగానే కాదు.. ఆధ్యాత్మికంగానూ ఈ ఇద్దరూ ఒకే బాటలో పయనిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ సాన్నిహిత్యంలో పవన్ దైవారాధనకు ఎక్కువ దగ్గరవడమే కాకుండా.. బ్రాహ్మణ ఆచార వ్యవహారాలపై కూడా మక్కువ కనబరుస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ 'జంధ్యం' ధరించినట్లుగా ఓ వార్త తెర పైకి రావడం గమనార్హం. <br />అజ్ఞాతవాసి సినిమాలో ఆఫీస్ ఎపిసోడ్స్‌లో భాగంగా వచ్చే.. జనరల్ బాడీ మీటింగ్ సన్నివేశం ఈ 'జంధ్యం' ప్రచారానికి ఊతమిచ్చిందంటున్నారు. ఆ సన్నివేశంలో పవన్ టీషర్టులో కనిపిస్తారు. ఆ సమయంలో ఆయన షర్ట్ లోపల నుంచి జంధ్యం కొంచెంగా కనిపించిందంటున్నారు. <br />గతంలో గోపాల గోపాల సినిమా సమయంలోనూ పవన్ 'జంధ్యం' టాపిక్ వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్న తన అభిమాని ఒకరిని పలకరించడానికి పవన్ వెళ్లారు. ఆ సందర్భంగా బయటకొచ్చిన ఫోటోల్లో పవన్ ధరించిన కుర్తా లోపల 'జంధ్యం' స్పష్టంగా కనిపించింది. అప్పటినుంచే పవన్ జంధ్యం ధరిస్తున్నారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Buy Now on CodeCanyon