Andhra Pradesh CM Nara Chandrababu Naidu expressed his prepardness to work with Telangana CM K chandrasekhar Rao (KCR).

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. చంద్రశేఖర రావుతో చర్చలు జరిపేందుకు తాను ఎల్లవేళలా సిద్దమేనని అన్నారు.
శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కిలిసి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు గతంలోనే సూచించినట్లు చంద్రబాబు చెప్పారు.
కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు మీరు చొరవ తీసుకుంటారా అని మీడియా ప్రతినిధులు అడిగితే, చొరవ తీసుకోవాల్సింది తాను కాదని, కేంద్ర ప్రభుత్వమని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని రావడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్ట అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన విమర్శలను చంద్రబాబు ఖండించారు. జగన్ ఎక్కడున్నారని, ఆయన చిరునామా ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు.