Surprise Me!

జై సింహా అలా..అఙ్ఞాతవాసి ఇలా.. పాపం డిస్టిబ్యూటర్లు..!

2018-01-15 1 Dailymotion

Directed by KS Ravikumar, the Sankranti offering received lukewarm response from critics and audience alike. Trade expert Ramesh Bala posted stating that there has been a huge drop in the collections of 'Jai Simha' and Agnyaathavaasi

2018 సంక్రాంతి అటు ప్రేక్షకులకు, ఇటు డిస్టిబ్యూటర్లకు నిరాశే మిగిల్చాయి. అఙ్ఞాతవాసి చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టడంతో డిస్టిబ్యూటర్లు, సినీ అభిమానులు ఊపిరి పిల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో నందమూరి నటసింహాం బాలకృష్ణ నటించిన జైసింహా సినిమా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్లు మోస్తారుగా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బాలకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్ రూపొందించిన జై సింహా చిత్రానికి క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి పెద్దగా స్పందన వ్యక్తం కాలేదు. అమెరికాలో జై సింహ చిత్రం 84 స్క్రీన్లలో గురువారం ప్రివ్యూ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దాంతో $107,512 డాలర్లు అంటే రూ. 68.35 లక్షలు వసూలైంది అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.
కాగా, జై సింహా చిత్రం శుక్ర, శనివారాల్లో అమెరికాలో ఓ మోస్తరు కలెక్షన్లు సాధించింది. శుక్రవారం జై సింహా చిత్రం రూ.52 లక్షలు (26 వేల డాలర్లు), శనివారం రూ.53లక్షలు వసూలు చేసింది. మొత్తంగా అమెరికాలో ప్రివ్యూతోపాటు రెండురోజుల కలెక్షన్లు రూ.1.70 లక్షలు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో జై సింహా కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. శుక్ర, శనివారాల లెక్కల ప్రకారం తెలంగాణ, ఏపీలో ఈ చిత్రం రూ.8.83 కోట్లు వసూలు చేసింది. బాలకృష్ణ సినిమా వరకు ఇవి ఓ రకంగా అత్యుత్తమమే అని చెప్పుకోవచ్చనే అభిప్రాయాన్ని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.

Buy Now on CodeCanyon