Surprise Me!

‘గాడ్,సెక్స్ అండ్ ట్రూత్’ ట్రైలర్ పై.. మహేష్ కత్తి కామెంట్!

2018-01-17 23 Dailymotion

Mahesh Kathi review on GST trailer. GST is neither a film, nor a short film nor a series..

"గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు...ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం.... అంటూ రామ్ గోపాల్ వర్మ ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" మొత్తం ఫైనల్ వీడియో ఈ జనవరి 26 ఉదయం 9 గంటలకి 'మియా మాల్కోవా' పేరుతో ఉన్న అఫీషియల్ ఛానల్లో విడుదల చేస్తామని వర్మ ప్రకటించారు. "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" ట్రైలర్ చూసిన సినీ విమర్శకుడు మహేష్ కత్తి దీనిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో, రామ్ గోపాల్ వర్మ అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్".... అని మహేష్ కత్తి తెలిపారు.
షాక్ వాల్యుని దాటి ముందుకు వెళితే ఎందరో తత్వవేత్తల వేదాంతం. ఎందరో విప్లవకారుల నినాదం ఈ ట్రైలర్ లో వినిపిస్తోంది. వర్మ చెప్తున్నాడు కాబట్టి, అనుమానాస్పదంగా చూడకుండా, ఆబ్జక్టివ్ గా చూస్తే ఒక ప్రాచీన సత్యం గోచరిస్తుంది. ఒక బలీయమైన, తృణీకరించలేని శారీరక పరమసత్యం అవగతం అవుతుంది..... అని మహేష్ కత్తి అభిప్రాయ పడ్డారు.
మియా రూపం. గొంతు. వర్మ షాక్ వాల్యుతోపాటు, ఎం.ఎం.కీరవాణి నేపధ్య సంగీతం ఒక ఎపిక్ విలువని జోడించింది. గుండె దిటవు చేసుకుని. మెదడు విప్పారజేసి చూడండి. మొత్తం ఫిల్మ్ ఎప్పుడు చూస్తామా అని నాకులాగా మీరూ ఎదురుచూస్తారు..... అని మహేష్ కత్తి కామెంట్ చేసారు.

Buy Now on CodeCanyon