Surprise Me!

లారీ బీభత్సం..ఇద్దరు మృతి.. భద్రాద్రిలో విషాదం..!

2018-01-17 3 Dailymotion

A lorry and truck hitting happened in Hyderabad and Bhadrachalam districts.

నగర శివారు వనస్థలిపురం సుష్మా సమీపంలో విజయవాడ రహదారిపై ఇసుక లారీ బుధవారం బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకెళ్లి దాని ముందర వెళ్తున్న ద్విచక్రవాహనంతో పాటు మూడు ఆటోలను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుటుంబసభ్యుల్లో తండ్రీ కొడుకులు మృతిచెందారు. మరో మహిళ, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఆటోల్లో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా..భద్రాద్రి జిల్లా చండ్రుగొండ ప్రధాన సెంటర్‌లో టిప్పర్‌ ఢీకొని ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. టిఫిన్‌ కోసమని తాతతో కలిసి వెళ్తున్న చెర్రీ అనే బాలుడిని కొత్తగూడెం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో చెర్రీ అక్కడికక్కడే మృతిచెందగా, బాలుడి తాత గాంధీ తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో ఆగ్రహించిన స్థానికులు టిప్పర్‌ను ధ్వంసం చేశారు. ఈ ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Buy Now on CodeCanyon