Surprise Me!

ఈ అర్హతలుంటే చాలు అమెరికాకి రావచ్చు.. తేల్చిన ట్రంప్..!

2018-01-17 1 Dailymotion

The Trump administration wants to admit immigrants who have skills, talent and can speak English, a top official has said, giving insight into the proposed merit-based system that may benefit individuals from countries like India.

అమెరికా తన వలస విధానాలను మార్చేయడంతో ఆ దేశానికి వెళ్లాలనుకున్న విదేశీ విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. అయితే, ఇందుకు అమెరికా కొన్ని మినహాయింపులను ఇప్పుడు ప్రకటించింది.
కాగా, ఇటీవల వలసలపై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని 'చెత్త దేశాల' నుంచి వచ్చే వలసలు తమకు అవసరం లేదంటూ ట్రంప్‌ తేల్చి చెప్పారు.
అయితే, ట్రంప్‌ పేర్కొన్న దేశాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాము వలసలకు వ్యతిరేకం కాదంటూ ట్రంప్‌ సర్కార్‌ మరోసారి స్పష్టం చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే అమెరికాకు వచ్చే వలసదారులకు కొన్ని నైపుణ్యాలుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోంది.
నైపుణ్యం, ఉద్యోగం, అనర్గళంగా ఆంగ్లభాషను మాట్లాడే సామర్థ్యం ఉన్నవారు ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా తమ దేశానికి వలస రావొచ్చంటూ ట్రంప్‌ ప్రభుత్వంలోని ఓ అధికారి తెలిపారు. వీసా జారీల్లో ప్రతిభ ఆధారిత విధానం ఇలాగే ఉంటుందని చెప్పారు. ఇలాంటి పాలసీ గనుక అమల్లోకి వస్తే భారత్‌ లాంటి దేశాలకు చెందిన వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
‘అమెరికా అంటే ఇష్టం ఉన్నవారు.. అమెరికా ప్రజలపై ప్రేమ ఉన్నవారు.. మంచి ప్రతిభ, నైపుణ్యం ఉన్నవారు.. ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడేవారు.. మా విలువలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేసేవారు.. ఏ దేశం వారైనా అలాంటి వారికి వీసాలు ఇవ్వాలని భావిస్తున్నాం' అని వలసల విధానంలో సంస్కరణలు చేపట్టాలని ట్రంప్‌ సర్కార్‌ భావిస్తోందని సదరు అధికారి పేర్కొన్నారు.

Buy Now on CodeCanyon