Surprise Me!

రామ్ చరణ్-బోయపాటి సినిమా మొదలైంది..!

2018-01-19 1 Dailymotion

Ram Charan is back in action once again as he began shoot for his untitled venture with director Boyapati Srinu on Friday.

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిత్ర నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ - ''మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బోయపాటి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఓ ఎక్స్‌పెక్టేషన్‌ ఉంటుంది. సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు... అన్నారు.
హీరోలను ఎక్స్‌ట్రార్డినరీగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను అద్భుతమైన కథతో రామ్‌చరణ్‌ను సరికొత్త రీతిలో చూపించనున్నారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించబోతున్నామని నిర్మాత తెలిపారు.
బాలీవుడ్‌ హీరోయిన్‌ కైరా అద్వాని ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. తమిళ నటుడు ప్రశాంత్‌, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం..
శుక్రవారం నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ నెలాఖరు వరకు మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతుంది. ఫిబ్రవరిలో సెకండ్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం. మెగాభిమానులు, ప్రేక్షకులు అంచనాలకు ధీటుగా సినిమాను రూపొందిస్తామని దానయ్య తెలిపారు.

Buy Now on CodeCanyon