In a big setback for the Aam Aadmi Party (AAP), the Election Commission on Friday disqualified 20 of its MLAs for holding 'office of profit', Times Now has reported. <br /> <br />ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. నివేదికను రాష్ట్రపతికి పంపిన ఈసీ.. ఆ 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది. 2015లో 21మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటీలుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నియమించారు. <br />కాగా, ఎమ్మెల్యేలను లాభదాయక పదవుల్లో నిమించారనే అభియోగాలు రావడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో చిక్కులు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు.. ఇది మరో ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. అయితే, ఈసీ సిఫారసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది కేజ్రీవాల్ ప్రభుత్వం. <br />