Popular Malayalam actor Bhavana entered the wedlock with her boyfriend Naveen on Monday morning in a temple wedding at Thrissur. Her Kerala style wedding was a simple and quick one in the presence of close family members and friends.

మలయాళ నటి భావన, కన్నడ నిర్మాత నవీన్ వివాహం ఘనంగా జరిగింది. కేరళలోని త్రిసూరులో సోమవారం (22 జనవరి)న తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారిద్దరూ ఒక్కటయ్యారు. భావన, నవీన్ వివాహం త్రిసూర్‌లోని జవహర్‌లాల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆడంబరంగా జరిగింది.
మీడియా కథనం ప్రకారం.. త్రిసూర్‌లోని తిరువంబదీ ఆలయంలోని వివాహా వేదికపై సోమవారం ఉదయం 9.30 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. పెద్దలు నిర్ణయించిన ముహుర్తం ప్రకారం భావన మెడలో నవీన్ మూడుమూళ్లు వేశారు.
పెళ్లి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మెహందీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపు రంగు డ్రెస్‌తో ధగధగలాండింది.
భావన పెళ్లి హంగులు ఆర్భాటాలకు తావివ్వకుండా కుటుంబ కార్యక్రమంగా నిర్వహించారు. ఈ పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
త్రిసూరులోని లులూ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాజకీయ, సినీ, వ్యాపార వర్గాలు హాజరుకానున్నారు.నాలుగేళ్లుగా నవీన్, భావన ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. వారిద్దరు రోమియో సెట్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు వారి రిలేషన్‌ను రెండేళ్లపాటు గోప్యంగా ఉంచారు.భావన పెళ్లికి బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా సర్ఫ్రైజ్ గిఫ్టును అందించింది. ఓ వీడియో సందేశాన్ని పంపించింది వివాహా శుభాకాంక్షలు తెలిపింది. ఆ వీడియోను ఇన్స్‌టాగ్రామ్ వెబ్‌సైట్లో పోస్ట్ చేసింది.