Andhra Pradesh Chief Minister Chandrababu Naidu arrived in Davos on Monday to attend World Economic Forum (WEF). CM Naidu called this year’s WEF as India’s World Economic Forum. <br /> <br />ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్‌ల్యాండ్ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఈనెల 25 వరకు చంద్రబాబు దావోస్‌లో ఉంటారు. కాగా పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు, అధికారులు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియా తో మాట్లాడారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇండియా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్‌లో అడుగు పెట్టీ పెట్టగానే పెట్టుబడుల వేట మొదలు పెట్టారు చంద్రబాబు. కాగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) వార్షిక సదస్సు లో భారత్‌కు సాదర స్వాగతం లభిస్తుంది. భారత్ నుంచి 130 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సమావేశం యావత్తూ భారత్ వేదిక సదస్సు సందర్భంగా భారత్ యోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. సదస్సులో 3 వేల మంది ప్రపంచ నేతలు పాల్గొంటారు