A group of miscreants protesting against release of movie Padmaavat created ruckus near malls by vandalizing shops and setting vehicles ablaze in Gujarat’s Ahmedabad on Tuesday.

సంజయ్ లీలా భన్సాలీ చిత్రం 'పద్మావత్' విడుదలకు వ్యతిరేకంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం రాజ్‌పుత్ కర్ణిసేన ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన చివరికి హింసాత్మకంగా మారింది. అల్లరి మూకలు రెచ్చిపోయి అహ్మదాబాద్‌లోని ఓ షాపింగ్ మాల్‌లోని దుకాణాలను ధ్వంసం చేశారు. ఓ సినిమాహాల్ సమీపంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాల్లో ఓ డజను వాహనాలను ఆందోళన కారులు తగలబెట్టారు.
తాజా హింస నేపథ్యంలో ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ పలు రాష్ట్రాల్లో పెద్ద సవాల్‌గా మారింది.
ఈనెల 25న పద్మావత్ సినిమా విడుదల నేపథ్యంలో మల్టీప్లెక్స్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరుతూ ఈ సినిమా దర్శక నిర్మాతలు సోమవారం పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసినట్లు తెలుస్తోంది. ముంబైలో ఈ సినిమా విడుదలయ్యే సినిమా థియేటర్లలో ముందు జాగ్రత్త చర్య కింద పోలీసు భద్రత కల్పించినట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.