Surprise Me!

India vs South Africa 2018 3rd Test DAY 1 @ Wanderers

2018-01-24 8 Dailymotion

India vs South Africa 2018 3rd Test DAY 1 @ Wanderers <br />India have more to take away from here than mere consolation. Only in trying to save a whitewash can this Indian team save itself the blushes before they leave the South African shores <br /> <br />గతంలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఏ భారత జట్టుకూ సాధ్యం కాని రికార్డును ప్రస్తుత టీమ్‌ సృష్టిస్తుందని ఈ టూర్‌కు బయల్దేరే ముందు కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. అయితే... ఇప్పుడు అది నిజంగానే నిజం కాకూడదని సగటు భారత క్రికెట్‌ అభిమాని బలంగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే 1992 నుంచి ఆరు సార్లు దక్షిణాఫ్రికాకు వెళ్లిన ఏ భారత జట్టు కూడా క్లీన్‌స్వీప్‌కు గురి కాలేదు. కనీసం ఒక మ్యాచ్‌ గెలవడం లేదా ఒకటైనా డ్రా చేసుకోగలిగింది. ఇప్పుడు సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఓడే ప్రమాదం ముందు నిలిచింది. తొలి రెండు టెస్టుల్లో ఓడి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన టీమిండియా మూడో టెస్టులో కోలుకోగలుగుతుందా... ప్రత్యర్థికి పోటీనిచ్చి పరువు కాపాడుకుంటుందా అనేది చూడాలి. <br />ప్రతిష్టాత్మక వాండరర్స్‌ మైదానంలో ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడిన భారత్‌ ఒకటి గెలిచి మూడు ‘డ్రా’ చేసుకోగా ఒక్కటి కూడా ఓడలేదు. టి20 ప్రపంచ కప్‌ గెలిచింది కూడా ఈ మైదానంలోనే. ఇలా అచ్చొచ్చిన వేదికపై తమ అదృష్టాన్ని మార్చుకునేందుకు కోహ్లి సేన సన్నద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటికే 2–0తో సిరీస్‌ గెలుచుకొని దక్షిణాఫ్రికా అమిత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, నంబర్‌వన్‌ టీమ్‌ హోదాలో పరువు కాపాడుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది.

Buy Now on CodeCanyon