Dredging Corporation of India (DCI) gets Rs 19.62 crores in Union Budget 2018. Now, Jana Sena chief Pawan Kalyan fans remembering his fight for DCI.

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, వైసీపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు భగ్గుమంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా అసంతృప్తితో ఉంది. విపక్షాలు భగ్గుమంటున్నాయి.
మరోవైపు, రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు బడ్జెట్ బాగుందని చెబుతున్నారు. దేశ ప్రజల కోసం, రైతుల కోసం, గ్రామీణులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశ పెట్టారని చెబుతున్నారు. బడ్జెట్‌లో తప్పుబట్టేందుకు ఏమీ లేదంటున్నారు. సామాన్యులకు అనుకూలమైన బడ్జెట్ అని చెబుతున్నారు. ఇతర పార్టీలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే బడ్జెట్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే చంద్రబాబు ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చిందని అంటున్నారు. అమరావతి రాజధాని భూమి మొదలు అన్ని అంశాలపై పవన్ ప్రశ్నిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిపై అనుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం కూడా పవన్ దెబ్బకు దిగి వచ్చిందని చెబుతున్నారు.
విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు 2018-19 బడ్జెట్‌లో కేంద్రం రూ.19.62 కోట్లు కేటాయించింది. దీనిపై సోషల్ మీడియాలో కౌంటర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తూటా బడ్జెట్‌లో పేలిందని అభిమానులు చెబుతున్నారు.