Nagarjuna's son Akhil Akkineni and Shriya Bhupal's problems started with a big fight the two had at Hyderabad airport. They called off their engagement. After long gap Shriya Bhupal marriage news goes viral in news

అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని మాజీ ప్రేయసి శ్రీయా భూపాల్ పెళ్లి కూతురుగా మారబోతున్నారట. అఖిల్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శ్రియా పెళ్లి వార్త గురించి వివరాల్లోకి వెళితే..
శ్రియా భూపాల్‌కు అక్కినేని వారసుడు అఖిల్‌తో నిశ్చితార్థం జరిగింది. చివరి నిమిషంలో పెళ్లి రద్దయ్యింది. దీనిపై రెండు కుటుంబాలు పెద్దగా స్పందించకపోగా... ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్‌టాపిక్ కూడా అయ్యింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు శ్రియా పేరు తెరపైకి వచ్చింది.
అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ అయినప్పటి నుంచి శ్రియా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నది. అలాగే అఖిల్ పూర్తిస్థాయిలో సినిమా, క్రికెట్‌పై దృష్టిపెట్టారు. ఇప్పట్లో అఖిల్ పెళ్లి చేసుకోనేందుకు ఆసక్తి చూపడం లేదని ఓ టాక్
కొన్ని నెలలుగా సైలెంట్గా ఉన్న శ్రియా పెళ్లి వార్త మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. అయితే ఈ సారి ఓ ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నారనే వార్త చర్చనీయాంశమైంది
శ్రియ వివాహం చేసుకొనే యువకుడు ఎవరో కాదు రాంచరణ్ భార్య ఉపాసన కజిన్ అనిన్‌దిత్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు