Telangana IT Minister K T Rama Rao inaugurated the 66th National Town and country planners congress 2018 by Institute of Town Planners in Hyderabad. <br /> <br />శుక్రవారం నగరంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) ఆధ్వర్యంలో 66వ నేషనల్ టౌన్ అండ్ కంట్రి ప్లానర్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి మంత్రి కే తారక రామారావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీసుకున్న అనుమతికంటే అధిక విస్తీర్ణంలో కట్టిన నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవద్దు? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకువస్తే ఎలా ఉంటుందో చెప్పాలని సదస్సుకు హాజరైన నిపుణులను కోరారు. <br /> <br />
