Surprise Me!

India should divide Pakistan into four pieces

2018-02-06 1 Dailymotion

Bharatiya Janata Party (BJP) Senior Leader Subramanian Swamy on Sunday reacted on the unprovoked ceasefire violations by Pakistani troops, saying that India should prepare and should divide Pakistan into four pieces. <br /> <br />సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండించిన సుబ్రమణ్యస్వామి.. పాక్ తో ఈసారి యుద్ధమే వస్తే.. ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేసేస్తామని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో రెండు ముక్కలు చేశామని.. ఈసారి కానీ యుద్ధమే వస్తే.. నాలుగు ముక్కలు గ్యారెంటీ అని వార్నింగ్ ఇస్తూ వ్యాఖ్యలు చేశారు. భారత్ యుద్దానికి సిద్దంగా ఉండాలని, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు. మనం కుదురుగా ఉన్నా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని అందుకు సరైన సమాధానం ఇవ్వాలని సుబ్రమణ్యస్వామి అబిప్రాయపడ్డారు. <br />కాగా జమ్మూ కాశ్మీరులోని రాజౌరి సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే, మృతుల్లో ఆర్మీ కెప్టెన్‌, ముగ్గురు జవాన్లు ఉన్నారు. <br />ఐతే దీనికి తోడు తాజాగా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించటంతో పాటు.. వాతావరణాన్ని మరింత హాట్ హాట్ గా తయారు చేసేటట్లు కనిపిస్తోంది. ఇక మరోపక్క తామంటే ఏమిటో చేతల్లోనే పాకిస్థాన్‌కు చూపిస్తామనీ, ప్రతీకారం తీర్చుకుంటామనీ భారత సైన్యం ప్రకటించింది.

Buy Now on CodeCanyon