A complaint has been filed against veteran Bollywood actor Jeetendra by his cousin in Himachal Pradesh.

ప్రముఖ నటుడు జితేంద్ర తనపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఓ బాధితురాలు సిద్ధమవుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బాధితురాలు జితేంద్రకు బంధువులు కావడం ఈ వివాదంలో ట్విస్ట్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
షూటింగ్ చూడాలని నా తండ్రిని కోరడంతో ఆయన జితేంద్ర షూటింగ్‌కు తీసుకెళ్లాడు. జితేంద్ర నాకు మేనమామ అవుతారు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు, ఆయనకు 28 ఏళ్లు. నాకు ఆయనకు పదేళ్ల తేడా ఉంది.
షూటింగ్ చూడటానికి వెళ్లిన సందర్భంలో నాపై జితేంద్ర లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో నా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో నేను ధైర్యంగా ఈ విషయాన్ని చెప్పగలుతున్నాను.
జితేంద్ర చేసిన నిర్వాకంతో నా తల్లిదండ్రులు గుండె పగిలి చనిపోయారు. నా జరిగిన అన్యాయానికి వారు తీవ్రంగా బాధపడ్డారు. ఆ బాధతోనే వాళ్లు మరణించారు.
లైంగిక దాడి విషయంలో మహిళా సంఘాలు ముందుకొస్తుండటం నాలో ధైర్యాన్ని నింపింది. సోషల్ మీడియా అడ్వాంటేజ్ కారణంగా #MeToo అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న కొంత విశ్వాసం పెరిగింది.
ఇప్పుడు నేను స్వంతంగా నిర్ణయాలు తీసుకొనే మహిళగా మారాను. నాపై లైంగిక దాడికి నేను చాలా కుంగిపోయాను. మానసిక క్షోభను అనుభవించాను. అప్పట్లో జితేంద్రకు రాజకీయ సంబంధాలు ఉన్నాయని భయపడ్డాను అని బాధితురాలు తెలిపారు.