Surprise Me!

Rangasthalam audio launch expectations are in high

2018-02-07 3,085 Dailymotion

Shocking news going viral in social media regarding Rangasthalam movie audio launch. Devisri Prasad demands 25 lakh remunaration for live perfofmance in audio launch

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం మార్చ్ 30 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర షూటింగు పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసి మార్చ్ ఆరంభం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ గురించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. రంగస్థలం చిత్ర యూనిట్ కే దేవిశ్రీ షాక్ ఇచ్చాడంటూ తెగ వైరల్ అయిపోతోంది.
కాగా రంగస్థలం నిర్మాతలు త్వరలో ఆడియో వేడుకకు ప్లాన్ చేస్తున్నారట.ఆడియో వేడుక కోసం దేవిశ్రీని సంప్రదించారట. ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తే చిత్రానికి మంచి ఊపొస్తుందని భావించారు. కానీ నిర్మాతల ప్రతిపాదనకు దేవిశ్రీ అంగీకరించలేదట. ఫ్రీగా అయితే చేయనని తనకు రూ 25 లక్షల పారితోషకం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిర్మాతలు కంగుతిన్నారు.
దేవిశ్రీపై వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ మరికొందరు మెగా ఫాన్స్, సినీవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. చిత్ర ఆడియో వేడుక త్వరలో నిర్వహించాలనుకోవడం వాస్తవమే అని కానీ దానికి సంబంధించిన ప్లానింగ్ ఫైనల్ కాలేదని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు.
దేవిశ్రీ ఈ మధ్య కాలంలో విదేశాలలో సైతం లైవ్ ఫెర్ఫామెన్స్ చేస్తున్నారు. ఆ షోలకు దేవిశ్రీకి పారితోషకం రూపంలో బాగానే కాసులు కురుస్తున్నాయి. దీనిని ఆధారం చేసుకుని ఈ పుకార్లు సృష్టించి ఉంటారనే అభిప్రాయాలు లేకపోలేదు.
దేవిశ్రీ ప్రసాద్ మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన సంగీత దర్శకుడు. చిరు, పవన్ మరియు బన్నీ అందరికి సూపర్ హిట్స్ అందించాడు. చరణ్ - దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఎవడు చిత్రం కూడా హిట్ అయింది. ఇక రంగస్థలం చిత్రం 1985 నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఆ తరహా కథలకు సంగీతమే కీలకం. ఇక సుకుమార్ - దేవీశ్రీ కలయికలో వచ్చిన ఏ ఆల్బమ్ కూడా ఫెయిల్ అవలేదు. దీనితో రంగస్థలం చిత్ర ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి.

Buy Now on CodeCanyon