Surprise Me!

Kothapalli Geetha Takes U Turn In Parliament

2018-02-09 2 Dailymotion

Araku MP Kothapalli Geetha lashed out at YSR Congress chief YS Jagan Mohan Reddy and Chief Minister Nara Chandrababu Naidu <br /> <br />అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకసభ వాయిదా పడిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఎంపీలు పదేపదే నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో స్పీకర్ సభను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు ఆ తర్వాత కొత్తపల్లి గీత మాట్లాడారు. పార్లమెంటులో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు అంతా ఓ డ్రామా అని మండిపడ్డారు. ఈ డ్రామాలు వద్దని అభిప్రాయపడ్డారు. అందులో చిత్తశుద్ధి, నిజాయితీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. గీత గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, ఆ తర్వాత టీడీపీకి దగ్గరై.. ఇప్పుడు ఇరు పార్టీలకు సమానదూరం పాటిస్తున్నారు. ఆమె జనసేన వైపు చూస్తున్నారని కూడా గతంలో ప్రచారం జరిగింది. <br />ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుకు, వైసీపీ అధినేత జగన్‌కు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సమస్యలపై టీడీపీ, వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. అసలు వైసీపీ వైఖరి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని చెప్పారు. <br />ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మంచిది అని అప్పట్లో సన్మానాలు చేయించుకున్నారని టీడీపీని ఉద్దేశించి కొత్తపల్లి గీత దుయ్యబట్టారు. రెండంకెల వృద్ధి రేటు అని చెప్పుకునే వాళ్లు ప్రత్యేక హోదా ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

Buy Now on CodeCanyon