Surprise Me!

A Boy Sleeping Next To His Lifeless Mother Goes Viral

2018-02-13 3 Dailymotion

In a shocking incident, a five-year-old boy was spotted at Hyderabad's Osmania General Hospital (OGH) as he lay fast asleep next to his lifeless mother

హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రిలో ఓ కన్నీటి కథ వెలుగు చూసింది. ఉస్మానియా ఆస్పత్రిలో తల్లి శవం పక్కన ఐదేళ్ల బాలుడు పడుకుని అక్కడి నుంచి లేవనని మొండికేశాడు. అయితే, తల్లి మరణించినట్లు ఆ పసివాడికి తెలియలేదు. కాటేదాన్‌కు చెందిన 36 ఏళ్ల సమీనా సుల్తానాను ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆదివారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో పడేసి వెళ్లిపోయాడు. ఆమెన చూడడానికి మరో వ్యక్తి లేడు. గుండెపోటుతో ఆమె మరణించింది.
సమీన దీన గాధ గురించి టైమ్స్ ఇండియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. భర్త అయూబ్ సమీనాను మూడేళ్ల క్రితం వదిలేశాడు. ఉస్మానియా ఆస్పత్రిలో మరణించిన తల్లి పక్కన ఐదేళ్ల షోయబ్ పడుకుని అక్కడి నుంచి లేవనని మొండికేశాడు. ఆస్పత్రి సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు చెప్పినా అతను వినలేదు.
ఆస్పత్రి వర్గాలు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్‌కు సమాచారం అందించారు. దాంతో పౌండేషన్‌కు చెందిన ఇమ్రాన్ మొహమ్మద్ అక్కడికి వెళ్లాడు. తల్లి పక్కన పడుకున్న పసివాడిని ఒప్పించి శవాన్ని మార్చురీకి తరలించడానికి కొన్ని గంటల సమయం పట్టింది..
మరో వార్డుకు తల్లిని తరలిస్తున్నట్లు బాలుడ్ని నమ్మించి శవాన్ని మార్చరీకి తరలించారు. ఆమె పక్కన నా అనేవారెవరూ లేకపోవడంతో ఆస్పత్రి వర్గాలు మెడికో లీగల్ కేసుగా పరిగణించి మైలారుదేవపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Buy Now on CodeCanyon