Surprise Me!

Hyderabad Breaks Vadodara's Guinness record

2018-02-13 110 Dailymotion

In an attempt to achieve a Guinness world record through the Swach Sarvekshan, around 15,000 students here on Monday began a cleanliness drive.

నగరంలో ఫిబ్రవరి 15 నుంచి చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన భారీ ప్రదర్శన సరికొత్త రికార్డు సృష్టించింది.
వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులతోపాటు విభిన్నవర్గాలకు చెందిన 15,320 మంది ఒకేసారి మూడునిమిషాలపాటు చీపుర్లతో రోడ్లను ఊడ్చివేశారు. దీంతో మరో కొత్త రికార్డు నమోదైంది.
ఈ కార్యక్రమం ద్వారా గతంలో 5,058 మందితో గుజరాత్‌లోని వడోదరలో నెలకొల్పిన గిన్నీస్ రికార్డును హైదరాబాద్ అధిగచించింది. దీంతోపాటు యూఎస్‌కు చెందిన హైరేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా దీనిని ప్రపంచ రికార్డుగా ప్రకటించింది.
రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో వీఎస్టీచౌరస్తా నుంచి బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు చీపుర్లు పట్టి రోడ్లన్నీ ఊడ్చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ సలహాదారు జీ వివేక్, మాజీ మంత్రి వినోద్ తదతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్రభాగాన నిలుపాలని విజ్ఞప్తిచేశారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. విద్యార్థులు, యువత ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొనడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Buy Now on CodeCanyon