Naga Shourya and Baby Shamili starring in the lead roles movie titled “Ammammagarillu” first look poster released today. Naga Shaurya and Baby Shamili posing with their grandmother in the first look poster.

చలో సినిమా సక్సెస్ జోష్‌తో హీరో నాగశౌర్య దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు బాలతారగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొన్న బేబి షామిలితో తాజాగా అమ్మమ్మగారిల్లు సినిమా కోసం జతకట్టాడు. శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌లో కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం అమ్మమ్మగారిల్లు. సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో సెట్‌లో పండగ వాతావారణం నెలకొన్నది. కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఈ చిత్రంలో చూడవచ్చు. కుటుంబంలో ఉండే మనస్పర్ధలు, ఆవేదన తదితర అంశాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు అని అన్నాడు.
హీరోయిన్ షామిలి మాట్లాడుతూ, ఓయ్ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతోనే మరో సినిమా చేయలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ అమ్మమ్మగారిల్లు కథ నచ్చడంతో సినిమాకు వెంటనే ఒప్పుకున్నాను. నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. నాగశౌర్యతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు.
దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ.. రిలేషన్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని రాసిన కథ ఇది. దర్శకుడిగా నాకిది తొలి సినిమా. తెరపై సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ కు థియేటర్ లో ఉన్నామన్నా ఫీలింగ్ కాకుండా పండగ వాతావరణంలో తమ కుటుంబంతో గడుపుతున్న అనుభూతి కలుగుతుంది అని చెప్పారు.