Surprise Me!

రష్మి ని చూసి షాకయ్యా, చెప్పుతో కొట్టాలి: బట్టలు ఊడదీసి కొట్టాలి !

2018-02-13 16 Dailymotion

Jabardasth Pavan aka Pavani Angry On Lady Getup and gay Comments.

ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కామెడీ షోలో, ఢీ-10 కార్యక్రమంలో తన పెర్ఫార్మెన్స్‌తో అందరినీ మంత్రముగ్దులను చేస్తున్న ఆర్టిస్ట్ పవన్ అలియాస్ పావని. ఇప్పటి వరకు జబర్దస్త్‌లో లేడీ గెటప్స్ వేసిన అందరి కంటే కూడా పవన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓసారి ఢీ-10లో పవన్ పెర్ఫార్మెన్స్ చూసి యాంకర్ రేష్మి కూడా ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఓ వెబ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఢీ-10 కార్యక్రమంలో ఎమోషన్ సాంగుపై పవన్ స్పందిస్తూ.... నేను ఆ సాంగ్ రియల్ గా ఫీలై చేశాను. అందుకే నా తోటి కంటెస్టెంట్స్, మాస్టర్స్, ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అయ్యారు. రేష్మి లేచి ఒక్కసారిగా కన్నీరు కారుస్తూ నా గురించి చాలా చెప్పింది. ఆమె అలా రియాక్ట్ అవుతుంది అని అనుకోలేదు అని... పవన్ తెలిపారు.
ఢీ 10లో పవన్ పెర్ఫార్మెన్స్ చూసిన అనంతరం రష్మి ఎమోషనల్ అవుతూ.... ‘ఐదేళ్ల నుండి పవన్‌ను చూస్తున్నాను. ఇండస్ట్రీకి చాలా మంది హీరో అవుదామనో, కమెడియన్ అవుదామనో, విలన్ అవుదామనో వస్తారు. అలాంటిది ఫీమేల్ రోల్స్ చేయాలంటే చాలా మంది సిగ్గుపడతారు. కానీ పవన్ ఇండస్ట్రీలో ఉంటే చాలు, పని ఉంటే చాలు అనుకుని ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ సర్వైవ్ అవుతున్నాడు, తన టాలెంటును నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు' అని రష్మి ఎమోషనల్ అయ్యారు.
లేడీ పాత్రలు వేయడం వల్ల గేలుగా మారిపోతున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి అనే ప్రశ్నకు పవన్ స్పందిస్తూ.... అలా అనే వారిని చెప్పుతో కొట్టాలి. లేదంటే బట్టలు ఊడదీసి కొట్టాలి. నేను కూడా కొన్ని టీవీ షోలలో ఇది విన్నాను. నా ముందు ఎవరైనా ఆ మాట అంటే చెప్పులు మెడలో వేసి బట్టలు ఊడదీసి తిప్పకపోతే నేను పేరు మార్చుకుంటాను... అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు.
వ్యాంపు క్యారెక్టర్లు వేసినంత మాత్రాన వ్యాంపులు కాదు, విలన్ క్యారెక్టర్లు వేసినంత మాత్రాన విలన్ కాదు, హీరో వేషాలు వేసినంత రియల్ హీరోలు కాదు. లేడీ గెటప్ వేసినంత మాత్రాన గేస్ కాదండీ. వారు వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ ను మీకు నచ్చితే ఆదరించండి. అంతే కానీ వారి గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. ఇష్టం లేకుంటే మూసుకుని కూర్చొండి అంటూ పవన్ ఫైర్ అయ్యారు.

Buy Now on CodeCanyon