Comedian Priyadarshi reveals his girl friend in social media. The actor is getting married on 23rd February at with Richa Sharma in Hyderabad
కమెడియన్ గా బాగా పాపులర్ అవుతున్నాడు ప్రియదర్శి. పెళ్లి చూపులు చిత్రం ద్వారా వచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ యంగ్ కమెడియన్ ప్రస్తుతం వరుస చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. మీడియాలో హీరో హీరోయిన్ల ప్రేమ పెళ్లి వ్యవహారాలే హాట్ టాపిక్ గా మారుతాయి. కానీ ఈ పాపులర్ కమెడియన్ తన ప్రేయసి పుట్టిన రోజు సందర్భంగా ప్రియురాలిని పరిచయం చేశాడు. ఇప్పుడు ప్రియదర్శి లవ్ స్టోరీ కూడా హాట్ టాపిక్కే.
పెళ్లి చూపులు చిత్రం జాతీయ అవార్డుని దక్కించుకుంది. అంతటి స్థాయి ఉన్న చిత్రంలో తొలి ప్రయత్నంలోనే ప్రియదర్శి అబ్బురపరిచారు. ఈ చిత్రం విడుదలయ్యాకా ఇండస్ట్రీ మొత్తం ప్రియదర్శి గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టింది.
తాజాగా విదులైన తొలిప్రేమ చిత్రంలో కూడా ప్రియదర్శి కామెడీ హవా కొనసాగింది. ఈ చిత్రంలో ప్రియదర్శి కామెడీ కూడా ఓ ప్రధానాంశంగా చెప్పుకోవచ్చు.
ప్రియదర్శి కూడా ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ప్రియదర్శి, రిచా శర్మ అనే యువతితో ఘాడమైన ప్రేమలో ఉన్నాడట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. నిన్న ఆ యువతి పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్ట్ పెట్టాడని తెలుస్తోంది.
ఫిలిం వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఈ యంగ్ కమెడియన్, రిచా శర్మని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23 న వీరి వివాహం హైదరాబాద్లో జరగనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది