Surprise Me!

Cauvery Water Dispute : Karnataka's Gain Is Tamil Nadu's Loss

2018-02-16 210 Dailymotion

The Supreme Court on Friday said that Karnataka will get additional 14.75 TMC of cauvery water, Tamil Nadu will now get 177.25 instead of 192 TMC water.

కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. తమిళనాడుకు 177.25 టీఎంసీల జలాలు కేటాయించగా, కర్ణాటకకు 284.75 టీఎంసీల జలాలను కేటాయించింది. ఈ తీర్పు ప్రకారం కర్ణాటకకు అదనంగా 14.5 టీఎంసీల నీరు లభిస్తుంది. కేరళ, పుదుచ్చేరికి జలాల కేటాయింపుల్లో మార్పు లేదు.
2007లో కావేరీ జలాలను లెక్కించిన సీడబ్ల్యూడీటీ ట్రిబ్యునల్ గతంలో 30 టీఎంసీల జలాలు కేరళకు, 7 టీఎంసీల జలాలు పుదుచ్చేరికి కేటాయించింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. జలాలపై ఏ రాష్ట్రానికీ ఓనర్‌షిప్ హక్కులు ఎవరికీ లేవని కూడా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ తీర్పులో స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటకకు 14.5 టీఎంసీలు నీరు అదనంగా మిగిలింది. అంతే కాకుండా బెంగళూరు నగరానికి 4.2 టీఎంసీల అదనపు నీరు సరఫరాకానుంది. దశాభ్దాల కాలంగా తమిళనాడు, కర్ణాటక చేసిన న్యాయపోరాటంలో చివకి కర్ణాటక సుప్రీం కోర్టులో విజయం సాధించింది.
కాగా 2016 సెప్టెంబర్ 5న అత్యున్నత న్యాయస్థానం పదిరోజుల పాటు తమిళనాడుకు రోజుకు 15,000 క్యూసెక్కులు చొప్పున నీళ్లివ్వాలని ఆదేశించడంతో ఇరురాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ తీర్పుపై కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తడం తో ఆ ఉత్తర్వును సవరించాలనంటూ కర్ణాటక ప్రభుత్వం పిటిషన్ దాఖలుచేసింది.

Buy Now on CodeCanyon