Arya to host sensational Tamil reality show. It will starts from April. 70 thousand members applied for aarya's swayam varam.

తమిళ హీరో ఆర్య సరికొత్త గేమ్ షోకు తెర తీయబోతున్నాడు. ఆర్య తమిళ సినిమాలతో బిజీగా ఉంటూనే తమిళ బుల్లితెర పై రియాలిటీ షోలో మెరిసేందుకు అంగీకరించాడు. కాగా ఈ రియాలిటీ షో అలాంటి ఇలాంటి రియాలిటీ షో కాదు. ఇందులో ఆర్య వరుడు గా కనిపిస్తాడు. ఈ షోలో పాల్గొనే యువతులంతా వధువులు అన్న మాట. ఇప్పటికే ఈ రియాలిటీ షోలో పాల్గొనడానికి 70 వేల మంది యువతులు దరఖాస్తు చేసుకున్నారంటే క్రేజ్ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ షో ని సదరు ఛానల్ ఏప్రిల్ నుంచి ప్రారంభించబోతోంది.
ఇప్పటి వరకు బుల్లి తెరపై పలు రియాలిటీ షోలు వచ్చాయి. కానీ ఈ షోకి పార్రంభం కాక ముందే రెస్పాన్స్ అదిరిపోయింది. ఏకంగా 70 వేల మంది యువతులు అప్లై చేసుకోవడంతో సదరు ఛానల్ ఉబ్బి తబ్బిబ్బవుతోంది.వాటిని జల్లెడ పట్టి కేవలం 18 మందికి మాత్రమే షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తారట.
ఒడ్డు పొడుగు.. ఆకర్షించే ఆహార్యం ఆర్య సొంతం. ఆర్యకు యువతుల్లో మంచి క్రేజ్ ఉంది. చాల మంది యువతులకు ఆర్య కలల రాకుమారుడు కూడా. అలాంటి హీరోకు బుల్లి తెరపై వధువుగా కనిపించే అవకాశం వస్తే అమ్మాయిలు గమ్మున ఉంటారా !
ఈ గేమ్ షో స్వయంవరం తరహాలో ఉంటుందట. పురాణాల్లో సీత, ద్రౌపతి వంటి వారిని సొంత చేసుకునేందుకు స్యయంవరం నిర్వహించారు.
కానీ ఈ గేమ్ షోలో స్యయంవరం మాత్రం యువతులకు. వారిలో విజేత గా నిలిచిన వారు ఆర్యకు వధువు అవుతారు.