YSR Congress party president YS Jagan's Sakshi media accused Jana Sena chief Pawan Kalyan that he is protecting Andhra Pradesh CM and Telugu Desam pary chief Nara Chandrababu Naidu.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తప్పు పడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. జగన్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాను మద్దతుగా నిలుస్తానని, అప్పుడు టిడిపి పంథా ఏమిటో తెలుస్తుందని పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో అన్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కుమ్మక్కయి నాటకం ఆడుతున్నారనే పద్ధతిలో సాక్షి మీడియా ఆ కథనాన్ని ప్రచురించింది. ఇదీ... బాబు అండో కో బండారం అనే శీర్షిక పెట్టి దుమ్మెత్తి పోసింది.
ఐదు కోట్ల మంది ఆంధ్రులకు సంజీవని వంి ప్రత్యేక హోదాపై ఎంపీల రాజీనామాకు సిద్ధమని ప్రతిపక్ష, నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పుడు గానీ మీరు కలిసి రండి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని విజ్ఞప్తి చేసినప్పుడు గానీ స్పందించకుండా లీకులతో కాలక్షేపం చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుక్షణం ఆయన రక్షణకు ఎంతగానో శ్రమపడుతున్న పార్టనర్ పవన్ కల్యాణ్‌ల బండారం విలేకరుల సాక్షిగా బయపడిందని సాక్షి రాసింది.
సోమవారంనాడు కొద్ది గంటల వ్యవధిలో వీరిద్దరి వ్యాఖ్యానాలు, విన్యాసాలు చూసి రాష్ట్ర ప్రజానీకం ఆశ్చర్యపోతోందని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై సాక్షి మీడియా అభిప్రాయపడింది. మేం అవిశ్వాస తీర్మానానికి సిద్ధమే... తెలుగుదేశం పార్టీని కూడా సిద్దం చేయండి అని జగన్ పవన్ కల్యాణ్‌కు సూచించిన నేపథ్యంలో చంద్రబాబు నోరు విప్పారని సాక్షి రాసింది.
సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ముఖ్యమంత్రి పోలవరం వద్ద మాట్లాడిన విషయాన్ని సాక్షి మీడియా ప్రస్తావించింది. "అవిశ్వాస తీర్మానం ఆలోచన తలాతోకా లేనిది. దానివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. రాజీనామాలు చేస్తే పార్లమెంటలో ఎవరు పోరాడుతారు. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మెజారిటీ ఎవరికి ఉందో తెలుసుకోవాలి. మెజార్టీ ఉన్నా అవిశ్వాసం పెడితే ఆరు నెలలు ఆ విషయంపై అసలు మాట్లాడే అవకాశం ఉండదు. అవిశ్వాసానికి కూడా పద్ధతులు, స్టేజీలు ఉంటాయి" అని చంద్రబాబు అన్నారు