Heroine centric storyline For Saidharam Tej movie. Karunakaran is directing this film.

వరుస పరాజయాల తరువాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రేమ కథల స్పెషలిస్టు కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కరుణాకరన్ సినిమాల అంతిమ రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ప్రేమ కథ అయినప్పటికీ అందులో వైవిధ్యాన్ని జోడించడం కరుణాకరన్ కు అలవాటు. ఈ చిత్రంలో తేజకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ చిత్ర కథ గురించి మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి.
సాయిధరమ్ తేజ్కు వరుసగా 5 పరాజయాలు ఎదురయ్యాయి. రొటీన్ కు బిన్నంగా వెళితే లాభం ఉంటుందని తేజు డిసైడ్ అయ్యాడు. అందుకే ప్రేమ కథల స్పెషలిస్టు కరుణాకరన్ దర్శత్వంలో నటిస్తున్నాడు.
అనుపమతో నటించబోతున్న తొలి మెగా హీరో సాయిధరమ్ తేజే.
ఇటీవల ఈ చిత్ర యూనిట్ అనుపమ పుట్టినరోజు వేడుకని ఘనంగా నిర్వహించింది. క్యూట్ హీరోయిన్ అనుపమ, సాయిధరమ్ తేజ్ జోడి వెండి తెరపై అదిరిపోవడం ఖాయం అని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్ర కథ మొత్తం అనుపమ చుట్టూ తిరుగుతుందని సమాచారం.కరుణాకరన్ కథని వైవిధ్య భరితంగా చాలా ఆసక్తిగా సిద్ధం చేసారని టాక్.
కరుణాకరన్ సినిమాలు ఎక్కువగా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటాయి. హీరోయిన్ పాత్రని బేస్ చేసుకుని కరుణాకరన్ స్టోరీని అల్లుతారు.
అదే విధంగా ఈ చిత్రంలో కూడా అనుపమ పాత్ర చుట్టూ చిత్ర కథని అల్లారట. అనుపమ, తేజు ప్రేమ కథ ఏమేరకు ఆకట్టుకోనుందో విడుదలయ్యాకే తెలియాలి.