After Jai Lava Kusa’s success, Jr NTR is back to work on his next film with Trivikram.The film is bankrolled by Haarika & Hassine Creations whose last project was Pawan Kalyan’s Agnyaathavasi, also helmed by Trivikram.But this movie title interestingly goes viral in media.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్, అజ్ఞాతవాసి లాంటి భారీ ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇదే. ఈ చిత్రంపై అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు త్రివిక్రమ్ అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకొన్నారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనున్న ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది.
సుమారు రెండు నెలల క్రితం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా ముహూర్తపు షాట్‌కు శ్రీకారం చుట్టారు. అజ్ఞాతవాసి సినిమా పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్రీ ప్రోడక్షన్‌లో మునిగిపోయారు. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది.
ఎన్టీఆర్ సినిమాకు అనేక టైటిల్స్ మీడియాలో ప్రచారం అయ్యాయి. రాముడు, భీముడు ఇతర పేర్లు బాగానే వినిపించాయి. అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చిన సినిమా పేరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది.
త్రివిక్రమ్ రూపొందించే ఈ సినిమా పేరు ఆన్ సైలెంట్ మోడ్ అని వినిపించింది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్నప్పటికీ కథకు ఉన్న విశిష్టతను బట్టి పెట్టాల్సి వచ్చిందనే మాట సినీ వర్గాల్లో ఉంది. అయితే మెయిన్ టైటిల్ వేరే ఉంటుందని, ఇది కేవలం ఉపశీర్షిక పెట్టే అవకాశం ఉంటుందని కొందరు అంటున్నారు.
తొలుత ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రచారం జరిగింది. అయితే అజ్ఞాతవాసి తర్వాత అనిరుధ్ వెనుకకు వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.