Surprise Me!

Sridevi News : Dubai Police Examining Phone Records

2018-02-27 1,392 Dailymotion

Boney Kapoor reportedly discovered Sridevi unconscious in a bathtub filled with water, after which she was taken to a hospital.

సినీ నటి శ్రీదేవి మృతిలో ఆసక్తికర కోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. శ్రీదేవి మృతికి ప్రమాదం కారణమని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. నివేదికలో గుండెనొప్పి అంశాన్ని ప్రస్తావించలేదు.
ఫోరెన్సిక్ నివేదిక మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పూర్తి వివరాలకు కొంత సమయం పడుతుందని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. అయితే నివేదికలో కార్డియాక్ అరెస్ట్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. మృతికి ముందు ఆమె మద్యం సేవించినట్లు గుర్తించారు.
శ్రీదేవి మృతికి సంబంధించి విచారణ కొనసాగుతోందని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. విచారణ కొనసాగిస్తున్నామన్నారు. పోలీసులు బోనీ కపూర్ సహా ముగ్గురు వాంగ్మూలం తీసుకున్నారు. బోనీను మూడున్నర గంటల పాటు ప్రశ్నించారు.
దుబాయ్ పోలీసులు శ్రీదేవి - బోనీ కపూర్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. శ్రీదేవి ఫోన్ నుంచి ఒక నెంబర్‌కు ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. ఈ కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
శ్రీదేవి మృతిపై యూఏఈ ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె మరణం వెనుక ఎలాంటి నేరపూరిత ఉద్దేశ్యం లేదని, ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడిందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆమె శరీరంలో ఆల్కాహాల్ గుర్తించినట్లు వెల్లడించారు.
నివేదిక నేపథ్యంలో అసలు శ్రీదేవి ఒక్కరే మద్యం తాగారా? ఎక్కడ తాగారు? ఎవరితో కలిసి తాగారు? బోనీ కపూర్ ముంబై వెళ్లి వచ్చారా, లేదా? ఆమెను ఎవరైనా తోసేశారా? మద్యం మత్తులో టబ్‌లో పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు కొందరు కార్డియాక్ అరెస్ట్ అని ఎందుకు చెప్పారనే కీలక అనుమానం రేకెత్తుతోంది. మృతిపై అబద్దం ఎందుకు చెప్పారనే చర్చ సాగుతోంది. దీంతో వారు వాస్తవాలు దాస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.

Buy Now on CodeCanyon