The Dubai Public prosecution wants to clarify its doubts fron Sridevi's husband Boney Kapoor. meanwhile Rumours erupt on social media surrounding Sridevi's lost life

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై చిలువలు పలువలుగా వార్తలు వస్తున్నాయి. ఆకస్మిక గుండె పోటుతో శ్రీదేవి మరణించినట్లు భావించారు. కానీ, ఇప్పుడు ఆ ఊసు కూడా రావడం లేదు. ఆమె మరణం ప్రస్తుతం ఓ మిస్టరీగానే మారింది.
శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి మరణం వెనక నేరపూరిత కారణాలు ఉన్నాయని దుబాయ్ పోలీసులు భావించడం లేదని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీదేవి భౌతిక కాయం చెడిపోకుండా ఎంబమింగ్ ప్రక్రియ నిర్వహించి మరికొన్ని రోజులు దుబాయ్ మార్చురీలోనే ఉంచాలని నిర్ణయించారు.
శ్రీదేవి మరణం వెనక నేరపూరిత కారణాలున్నాయని భావించనప్పుడు దుబాయ్ పోలీసులు బోనీ కపూర్‌ను ఎందుకు విచారిస్తున్నారనేది ప్రశ్న. శ్రీదేవి అపస్మారక స్థితిలో ఉండడం చూసిన బోనీ కపూర్ హోటల్ వైద్యుడిని పిలువకుండా తన మిత్రుడికి ఫోన్ చేసి అతన్ని ఎందుకు పిలిచాడనేది పోలీసులు తేల్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రమాదాలు జరిగినప్పుడు హాజరు కావడానికి స్టార్ హోటళ్లలో అత్యవసర బృందం ఉంటుంది. వైద్యులు కూడా ఉంటారు. వైద్యులు లేకుంటే, వైద్య సహాయం అందించే ఏర్పాటు ఉంటుంది. మొదట వాళ్లకు చెప్పకుండా బోనీ కపూర్ తన మిత్రుడికి ఎందుకు చెప్పారనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చనిపోయిందని తెలుసుకున్న తర్వాతనే మిత్రుడికి ఫోన్ చేశారా అనేది ప్రశ్న. విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్పాల్సి వచ్చిందనేదని మరో ప్రశ్న.
శ్రీదేవికి, ఆమె భర్త బోనీ కపూర్‌కు మధ్య గొడవలేమైనా ఉన్నాయా అనేది పోలీసులు తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే శ్రీదేవి చివరిసారిగా చేసిన ఫోన్ కాల్స్‌పై వారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే శ్రీదేవి భౌతిక కాాయాన్ని అప్పగించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నారు