Sridevi's co-star, MP Murali Mohan recollected some memories with the actress. He said Sridevi suffered to reach her ultimate position in the film industry.

శ్రీదేవి మరణం యావత్ లోకాన్ని విషాద సంద్రంలో ముంచేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో సినీనటుడు, ఎంపీ మురళీమోహన్ శ్రీదేవి తో తన అనుభవాలను పంచుకొన్నారు. మురళీ మోహన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
శ్రీదేవి మరణించారనే వార్త ఆదివారం ఉదయం 5.30 గంటలకు తెలిసింది. కానీ అది తప్పుడు వార్త అని అనుకొన్నాను. ఏదో రూమర్ అయి ఉంటుంది అనే ఉద్దేశంతో టెలివిజన్ పెట్టి చూడగానే ఆ వార్త నిజమని తెలిసింది. దాంతో షాక్‌కు గురయ్యాను.
బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శ్రీదేవి అంచెలంచెలుగా ఎదిగింది. సినీరంగంలో మహోన్నత శిఖరాన్ని అధిరోహించిన ఆమెకు కష్టాలు లేవనుకోవడం తప్పు. ఎంతో మానసిక వ్యధ అనుభవించింది.
సినీరంగంలో రాణించడం వెనుక శ్రీదేవి తల్లిది కీలకపాత్ర. నటిగా ఆమెను బాగా తీర్చిదిద్దారు. ఎల్లవేళలా వెంట ఉండి శ్రీదేవికి అన్నిరకాల సహాయ, సహకారాలు అందించారు.
తన వ్యక్తిగత జీవితంలో, ప్రొఫెషన్‌లో కీలక పాత్ర పోషించిన తన తల్లి మరణించినపుడు శ్రీదేవి మానసికంగా కుంగిపోయింది. ఆ ఘటన నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది.
శ్రీదేవి అందరితో కలిసిపోదు అనడంలో వాస్తవం లేదు. తనకు పరిచయమైన వారందరితో కలివిడిగా ఉంటుంది. ముభావంగా కనిపించినా తనకు నచ్చిన వాళ్లతో బాగాను ఉంటుంది. ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ప్రభావం శ్రీదేవి ముఖం మీద కనిపిస్తుందేమో తెలియదు.
శ్రీదేవితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మేము చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించే సరికి శ్రీదేవి దేశంలోని ఓ సూపర్‌స్టార్‌గా మారింది. మేము తక్కువ బడ్జెట్‌తో రూపొందిచే వాళ్లం కనుక ఆమెతో సినిమా తీసే అవకాశం లభించలేదు.