Surprise Me!

Boney Kapoor Finally Responds On Sridevi's Loss

2018-03-01 1,478 Dailymotion

Finally Boney Kapoor responds after Sridevi lost life. He made emotional appeal in Sridevi Twitter account.

అతిలోక సుందరి శ్రీదేవి సినీ అభిమానుల గుండెల్లో అందమైన చరిత్రగా మిగిలిపోయింది. బుధవారం లక్షలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయుల నడుమ శ్రీదేవి అంత్య క్రియలు పూర్తయ్యాయి.శ్రీదేవి మరణం తరువాత ఆమె భర్త బోనికపూర్ తొలిసారి స్పందించారు. అదికూడా శ్రీదేవి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లోకి దూరి మరీ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.
శ్రీదేవి మృతిపై దుబాయ్ లో పెద్ద హైడ్రామానే సాగింది. పోలీస్ ల ఎంక్వైరీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ అంటూ పలు వార్తలు మీడియా సంస్థల్లో హల్ చల్ చేసాయి. వాటిలో నిజం లేకపోతే శ్రీదేవి మరణం గురించి అన్నిరకాలుగా వార్తలు ఎలా పుట్టుకొస్తాయని వాదించేవారు లేకపోలేదు.
లక్షలాది మంది అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య శ్రీదేవి అంతిమ యాత్ర సాఫీగా జరిగింది. దుబాయ్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో శ్రీదేవి చివరి మజిలీ సాఫీగా జరుగుతుందా అనే అనుమానాలు సగటు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. ఎట్టకేలకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ శ్రీదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ఆందోళన వైదొలిగి, అభిమానులు ఆమెని కడసారి చూసుకునే అవకాశం కలిగింది.
అప్పటివరకు శ్రీదేవి మరణంపై మౌనం వహించిన బోని కపూర్, అంత్యక్రియల అనంతరం స్పందించారు. శ్రీదేవి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఆయన ఎమోషనల్ గా ఓ ప్రకటన విడుదల చేసారు
స్నేహితురాలి లాంటి భార్యని, ఇద్దరు యుక్తవయస్సులో ఉన్నకుమార్తెల తల్లిని కోల్పోవడం వర్ణనాతీతమైన బాధ అని బోనికపూర్ అన్నారు.

Buy Now on CodeCanyon