Surprise Me!

Vodafone Planning To Start 4G Network On Moon

2018-03-02 1,207 Dailymotion

Several companies announced on Tuesday a joint effort to bring mobile phone coverage to the moon in 2019. A 4G wireless network is set to be installed on the moon by Vodafone, Nokia, Audi and SpaceX

టెలికాం రంగంలో ఏటా అద్భుతమైన ప్రగతి కనిపిస్తోంది. ఇప్పటికే 4జీ సేవలు ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో 5జీ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా చంద్రుడిపై 4జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి.
వొడాఫోన్ జర్మనీ ఈ బృహాత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీ పార్ట్‌నర్‌గా నోకియాను నియమించుకొంది.
అంతా అనుకున్నట్లుగా జరిగితే 2019లో.. అంటే వచ్చే ఏడాదే చందమామపై 4జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ ఏర్పాటవుతుంది.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా'కు చెందిన వ్యోమగాములు చంద్రుడి ఉపరితలంపై నడిచి దాదాపు 50 ఏళ్లు పూర్తికావస్తోంది. ఇప్పుడు మళ్లీ అంతరిక్ష పరిశోధనల భవిష్యత్తును నిర్దేశించే బృహత్తర ప్రయత్నం జరగబోతోంది.
వొడాఫోన్ జర్మనీ పీటీ సైంటిస్ట్స్ కంపెనీతో కలిసి ఈ చంద్రయానం ప్రాజెక్టు చేపట్టనుంది. 2019లో కేప్ కెనవరాల్ నుంచి స్పేస్ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ మూన్ ప్రయోగం చేపట్టనున్నారు.
చంద్రుడిపై పరిశోధనల వివరాలు, అక్కడ తీసే చిత్రాలు ఎప్పటికప్పుడు స్పష్టమైన నాణ్యతతో భూమి మీది అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని మిషన్ కంట్రోల్‌కు అందించేందుకు ఈ 4జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ అవసరమవుతుంది. వొడాఫోన్ చంద్రుడిపై ఏర్పాటు చేసే నెట్‌వర్క్ ద్వారా 1800MHz ఫ్రీక్వెన్సీ కలిగిన 4జీ సేవలు లభిస్తాయి.

Buy Now on CodeCanyon