Rohit Sharma-led India enter the tournament against Sri Lanka and Bangladesh as favourites. India got one-day international and T20 series wins over South Africa earlier this month.
ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాల్గొనేందుకు గాను రోహిత్‌శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆదివారం శ్రీలంకకు బయల్దేరి వెళ్లింది. కొలంబోకు వెళ్లే ముందు ఆటగాళ్లందరూ ముంబై విమానాశ్రయంలో కలిసి దిగిన ఫొటోలను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ ఆటగాళ్లు ధోని, భువనేశ్వర్, బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలెక్షన్ కమిటీ ఈ సిరిస్‌లో కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌తో పాటు దీపక్ హుడా, సుందర్, విజయ్ శంకర్, రిషబ్ పంత్‌లు చోటు దక్కించుకున్నారు.

శ్రీలంక స్వాతంత్య్ర వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ మంగళవారం ఆతిథ్య శ్రీలంక, భారత్ మధ్య జరగనుంది. ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి సార్లు ఆడుతాయి. టాప్‌లో నిలిచిన రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడుతాయి.