CCTV footage from the players area at Kingsmead, Durban, has shown Australian vice-captain David Warner and South African wicketkeeper Quinton de Kock involved in a heated exchange during the tea break on day four of the first Test on Sunday (March 4).
డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్‌లు ఒకరిపై మరొకరు చేయి చేసుకునేంత వరకు వెళ్లారు.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఏబీ డివిలియర్స్‌ను డేవిడ్ వార్నర్ రనౌట్ చేశాడు. రనౌట్ అనంతరం అంఫైర్లు టీ బ్రేక్ ఇచ్చారు.

టీ బ్రేక్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల తమ తమ డ్రస్సింగ్ రూమ్‌లకు వెళ్లే క్రమంలో ముందుగా ఆసీస్ ఆటగాళ్లు మెట్లు ఎక్కుతున్నారు. వారి వెనుకనే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డీకాక్ వస్తున్నాడు. ఈ సమయంలో మెట్లు ఎక్కుతూ డీకాక్‌పై వార్నర్ తన మాటలతో విరుచుకుపడ్డాడు. సహచర ఆటగాళ్లు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు.

ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్ స్మిత్ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ అయింది.