Megastar Chiranjeevi's song Sundai from Khaidi No 150 goes viral in US. US music lovers are crazy about that song.

పాటకు లయబద్దంగా డాన్స్ వేస్తూ అభిమానులని ఉర్రూతలూగించడం మెగాస్టార్ చిరంజీవికే చెల్లింది. తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 లో కూడా చిరు డాన్సులు ఇరగదీసాడు. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అభిమానులని ఆకట్టుకుంది. కాజల్ అగర్వాల్ తో కలసి మెగాస్టార్ వేసిన స్టెప్పులు అభిమానుల చేత విజిల్స్ పెట్టించాయి.

సినిమాల విషయంలో గ్యాప్ వచ్చింది కానీ తనలోని గ్రేస్ లో మార్పు రాలేదని చిరంజీవి నిరూపించారు. మెగాస్టార్ వెండితెరపై వేసే స్టెప్పులకు ఎలాంటి స్పందన ఉంటుందో ఈ చిత్రం ద్వారా మరోమారు రుజువైంది.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ అదిరిపోయే ఆల్బమ్ అందించాడు.

ఖైదీ చిత్రంలోని సుందరి అనే సాంగ్ ప్రస్తుతం అమెరికాని కుదిపేస్తోంది. సినిమా విడుదలైన ఏడాది గడచిన తరువాత ఆ పాట అమెరికాలో పాపులర్ కావడానికి కారణం ఉంది.

టీం శ్రాయ్ ఖన్నా అనే డాన్స్ గ్రూప్ ఇండియాలో పలు ఈవెంట్ లలో పాల్గొంది. వారి స్లో మోషన్ మరియు వేగవంతమైన స్టెప్పులతో మంచి పేరు సంపాదించారు. కాగా ఇటీవల ఈ టీం కు అమెరికాలోని షోటైం యట్ ది అపోలో అనే టివి షో నుంచి పిలుపు వచ్చింది.