Telangana Chief Minister K Chandrasekhar Rao has met Governor Narasimhan on Monday and complaint against Centre.
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ గళమెత్తిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మరో అడుగు ముందుకేశారు. ఈసారి ఏకంగా కేంద్రం తీరుపై ఆయన గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

తెలంగాణపై కేంద్రం తీరు ఏమాత్రం సరిగా లేదనికేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి ఎలాంటి ప్రోత్సాహం లేదని, విభజన హామీలు సైతం అమలు జరగడం లేదన్నారు. కేసీఆర్ సోమవారం రాత్రి రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

దాదాపు రెండు గంటల పాటు వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందని సమాచారం. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుపై కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రాల పట్ల కేంద్రం విధానం మారాలన్నదే తన అభిమతమని చెప్పారు. ఇందుకోసం తాను జాతీయ రాజకీయ ప్రక్షాళనపై దృష్టి సారించానని కేసీఆర్ వెల్లడించారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ప్రగతిపరంగా కొన్ని అంశాల్లో ఇంకా పునాది దశలోనే ఉందని, ఇది బాధాకరమని, పాలనలో సమగ్ర మార్పు రావాలని, దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలలోను ఇదే అభిప్రాయం ఉందని, కొత్తగా ఏర్పడిన తెలగంాణ స్వయంవృద్ధిని సాధిస్తున్నా కేంద్రం నుంచి సాయం అందాలని కోరుకుందని, కానీ ఏమీ జరగడం లేదని, హామీలపై తెలంగాణ వాదన పట్టించుకోవడం లేదని కేసీఆర్ వాపోయారు. తమపై చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు.